Jagan: రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం
- 2022-23 రుణ ప్రణాళిక లక్ష్యాలపై సమీక్ష
- రూ.53,149 కోట్లు రుణంగా ఇచ్చామన్న బ్యాంకర్లు
- 9 నెలల్లోనే 124 శాతం లక్ష్యం చేరుకున్నామంటూ సీఎం హర్షం
- స్వయం సహాయ సంఘాలపై అధిక వడ్డీలు సరికాదని వెల్లడి
సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళిక లక్ష్యాలపై సీఎం జగన్ ఈ సమావేశంలో సమీక్షించారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.53,149 కోట్లు రుణంగా ఇచ్చామని బ్యాంకర్లు వెల్లడించారు. 9 నెలల్లోనే 124 శాతం లక్ష్యం చేరుకోవడం సంతోషదాయకమని సీఎం జగన్ పేర్కొన్నారు.
అయితే, గృహ నిర్మాణ రుణాలు లక్ష్యం కంటే తక్కువగా ఉన్నాయని అన్నారు. కౌలు రైతులకు తొమ్మిది నెలల్లో రూ.1,126 కోట్ల రుణాలే ఇవ్వడం విచారకరం అని అభిప్రాయపడ్డారు. స్వయం సహాయ సంఘాలపై బ్యాంకులు అధిక వడ్డీ వేయడం సరికాదని తెలిపారు.