Somu Veerraju: మోహన్ బాబుతో భేటీ అయిన సోము వీర్రాజు

Somu Veerraju meets Mohan Babu
  • తిరుపతిలోని మోహన్ బాబు నివాసంలో సమావేశం
  • ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని విన్నపం
  • గత ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతిచ్చిన మోహన్ బాబు
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబును ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. తిరుపతిలోని మోహన్ బాబు నివాసంతో వీరి సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మోహన్ బాబును వీర్రాజు కోరారు. మరోవైపు మీడియాతో సోము వీర్రాజు మాట్లాడుతూ... బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వీర్రాజు స్పందిస్తూ... కిరణ్ కుమార్ రెడ్డి చాలా చురుకైన వ్యక్తి అని చెప్పారు. 

ఇదిలావుంచితే, గత ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.
Somu Veerraju
BJP
Mohan Babu
Tollywood

More Telugu News