K Kavitha: కవితను ఎనిమిది గంటలుగా విచారిస్తున్న ఈడీ
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
- ఈడీ నోటీసులతో విచారణకు హాజరైన కవిత
- పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవిత వాంగ్మూలం నమోదు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నోటీసులు అందుకున్న కల్వకుంట్ల కవిత ఈ మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వచ్చారు. గత 8 గంటలుగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ను అప్పగించాలని ఈడీ అధికారులు సూచించగా, తన సెక్యూరిటీ సిబ్బంది సాయంతో ఇంటి వద్ద ఉన్న ఫోన్ ను తెప్పించిన కవిత ఈడీ అధికారులకు అందించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవిత వాంగ్మూలం నమోదు చేశారు.
కాగా, ఈ స్కాంలో నిందితుడు అరుణ్ పిళ్లైతో కలిసి కవితను విచారించినట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా కవితను ప్రశ్నించినట్టు సమాచారం.
అంతేకాకుండా, ఆధారాలు ధ్వంసం చేశారన్న అభియోగాలపైనా, డిజిటల్ ఆధారాలు లేకుండా చేశారన్న అభియోగాలపైనా, హైదరాబాదులో జరిగిన సమావేశాలపైనా, ఢిల్లీ ముఖ్యమంత్రి, అప్పటి డిప్యూటీ సీఎంతో భేటీలపైనా ఆరా తీసినట్టు తెలుస్తోంది.