Karnataka: ఆ రాష్ట్రంలో వందేళ్లు దాటిన ఓటర్లు 17 వేల మంది

Around 17k voters above 100 years old in karnataka

  • కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు
  • 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం
  • రాష్ట్ర శాసన సభలో  224 మంది సభ్యులు

కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ గడువు మే 24న ముగియనుంది. దీంతో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసింది. పోలింగ్ శాతం పెంచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 80 ఏళ్లు దాటిన వృద్దులు, వికలాంగులు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

రాష్ట్రంలో వందేళ్లు దాటిన ఓటర్లు దాదాపు 17 వేల మంది ఉన్నట్టు తెలిపింది. పోలింగ్ బూత్ కు రాలేని 80 ఏళ్లు దాటిన ఓటర్లు ఇంటి వద్దనే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్టు ముఖ్య ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ సదుపాయం కల్పించడం ఇదే తొలిసారన్నారు.

కర్ణాటక అసెంబ్లీలోని 224 సీట్లలో ఎస్సీలకు 36, ఎస్టీలకు 15 రిజర్వు చేశారు. రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో మహిళా ఓటర్లు 2.59 కోట్ల మంది ఉన్నారు. శతాధిక వృద్ధులు 16,976, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 4,699 మంది ఉన్నట్టు గుర్తించారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 12.15 లక్షల మంది, వికలాంగ ఓటర్లు 5.55 లక్షల మంది తమ ఓటు వినియోగించుకోనున్నారు.

  • Loading...

More Telugu News