Honda: 100 సీసీ కేటగిరీలో హోండా కొత్త బైక్
- స్ప్లెండర్ కు పోటీగా తీసుకొస్తున్న హోండా సంస్థ
- ఈ నెల 15న లాంచ్ చేయనున్నట్లు ప్రకటన
- గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులే టార్గెట్
- రూ.70 వేలకు కాస్త అటూఇటూగా ధర!
గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులే టార్గెట్ గా హోండా కంపెనీ సరికొత్త బైక్ ను తయారుచేసింది. ఈ నెల 15న లాంచ్ చేయనున్న ఈ బైక్ తో స్ప్లెండర్ కు గట్టి పోటీనివ్వాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 100 సీసీ కేటగిరిలో స్ప్లెండర్ కు అత్యంత ఆదరణ లభిస్తోంది. ఈ బైక్ లకు సహజంగానే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ. దీంతో హోండా కంపెనీ ఈ కొత్త బైక్ ను తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ బైక్ కు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసింది. ఆకట్టుకునే డిజైన్ తో తయారుచేసిన ఈ కొత్త బైక్ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు.
ఈ కొత్త బైక్ ఫీచర్లు..
డిజైన్ విషయానికొస్తే హోండా షైన్ 125 సీసీ బైక్ ను పోలి ఉండే అవకాశం ఉంది. ముందుభాగం అచ్చం షైన్ 125 మోడల్ ను తలపించేలా ఉంది. టెలిస్కోపింగ్ ఫోర్క్, డ్యూయల్ షార్క్ అబ్జార్బర్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఇంజిన్ ఇలా..
హోండా 100 సీసీ బైక్ లో 100 సీసీ సింగిల్ సిలెండర్, ఫ్యూయెల్ ఇన్జెక్టర్ ఇంజిన్ ఉంటుంది. స్ల్పెండర్, బజాజ్ సీటీ 100, ప్లాటినా బైక్ లకు పోటీగా తీసుకొస్తోంది. దీంతో ధర కూడా వాటికి దగ్గరగానే ఉండే అవకాశం ఉంది. దీని ధర రూ.70,000 (ఎక్స్ షోరూం) కు కాస్త అటూఇటూగా ఉండే చాన్స్ ఉంది.