KCR Wife Shobha: కేసీఆర్ భార్య శోభకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక.. కేసీఆర్ కూ వైద్య పరీక్షలు?
- స్వల్ప అస్వస్థతకు గురికావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన శోభ
- చికిత్స అందిస్తున్న డాక్టర్లు.. కొన్ని పరీక్షల తర్వాత డిశ్చార్జ్ అయ్యే అవకాశం
- ఆసుపత్రిలోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. శోభ వెంట కేసీఆర్ కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే శోభతో పాటు సీఎం కేసీఆర్ కూడా స్వల్ప అస్వస్థతకు గురికావడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తన తల్లిని చూడటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్‌లోని తన నివాసానికి కవిత వెళ్లిపోయారు. ప్రస్తుతం శోభ ఆరోగ్యం నిలకడకానే ఉందని వైద్యులు చెబుతున్నారు. హరీశ్, కేటీఆర్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కొన్ని వైద్య పరీక్షల తర్వాత శోభ డిశ్చార్జ్ అవుతారని.. సతీమణితో కలిసే కేసీఆర్ ఇంటికెళ్తారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఈడీ విచారణలో ఏం జరిగిందనే దానిపై చర్చించారు. ఈ నెల 16న మరోసారి విచారణకు వెళ్లడంపై చర్చించారు. ఈ సమావేశం జరిగిన కొద్దిసేపట్లోనే శోభ అస్వస్థతకు గురయ్యారు.