Indian Railways: టికెట్లపై రాయితీ ఎత్తేశాక రైల్వే రాబడి ఫుల్

Income From Passenger Tickets increaed After concession withdraw says Railway ministry
  • కరోనా ముందు వరకు వివిధ వర్గాలకు రాయితీ
  • ఆ తర్వాత వృద్ధులకు ఇచ్చే రాయితీని రద్దు చేసిన రైల్వే
  • పునరుద్ధరించే అవకాశం లేనట్లేనని అధికారుల అభిప్రాయం
వృద్ధులు, రోగులు, వికలాంగులు, జర్నలిస్టులు.. తదితర వర్గాలకు టికెట్ ధరపై రైల్వే రాయితీ ఇచ్చేది. కరోనా లాక్ డౌన్ ముందు వరకు సీనియర్ సిటిజన్లు (పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం) రాయితీతో ప్రయాణించే వీలుండేది. కరోనా తర్వాత ఈ రాయితీలను రైల్వే శాఖ ఎత్తేసింది. కొన్ని వర్గాలకు మాత్రమే ప్రస్తుతం రాయితీ ఇస్తోంది. ఇలా రాయితీ రద్దు చేయడంతో టికెట్లపై వచ్చే ఆదాయం బాగా పెరిగిందని రైల్వే శాఖ వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 50 శాతం పెరిగిందని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 10వ తేదీనాటికి కేవలం రిజర్వుడు టికెట్ల నుంచే రూ. 3,805 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ మొత్తం రూ. 4 వేల కోట్లు దాటుతుందని చెప్పారు. 2018-19 ఏడాదిలో రూ.2,550 కోట్లు, 2019-20లో రూ.2,609 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. ముఖ్యంగా థర్డ్ ఏసీ బోగీలతో రాబడి అధికంగా ఉందని, దీంతో స్లీపర్ బోగీలను తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచుతున్నట్లు తెలిపారు.

ప్యాసింజర్ ట్రైన్ల ద్వారా వచ్చే రాబడి తక్కువగా ఉందని, రాయితీ ఇవ్వడం వల్ల ఇది మరింత తగ్గుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పలు సందర్బాలలో చెప్పారు. దీంతో రైల్వే టికెట్లపై వివిధ వర్గాలకు గతంలో ఇచ్చిన రాయితీని పునరుద్ధరించే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Indian Railways
concession
subsidy
Train tickets
senior citizens

More Telugu News