dokka manikya vara prasad: కిరణ్ కుమార్ రెడ్డిపై డొక్కా మాణిక్య వరప్రసాద్ సెటైర్లు
- బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో వారికి ఒక్క ఓటే వస్తుందన్న డొక్కా
- సొంత ఇంట్లో వాళ్లు కూడా ఆయనకు ఓటు వేయరని ఎద్దేవా
- అలాంటి వారిని చేర్చుకోవడం వల్ల బీజేపీకి ఉపయోగం లేదని వ్యాఖ్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ సెటైర్లు వేశారు.
బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరడం వల్ల వారికి ఒక్క ఓటు మాత్రమే వస్తుందని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డికి సొంత ఇంట్లో వాళ్లు కూడా ఓటు వేయరని ఎద్దేవా చేశారు. అలాంటి వారిని బీజేపీలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేక దొంగ ఓట్లు అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. స్వతంత్ర వ్యవస్థ కలిగిన ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిష్పాక్షికంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారని చెప్పారు.
ఇదిలావుంచితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీని 2014 మార్చిలో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. తర్వాత ఆ పార్టీని రద్దు చేసి 2018 జులైలో కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.