Oscar Gift Bag: ఆస్కార్ నామినీలకు గిఫ్ట్ బ్యాగ్.. విలువ ఎంతంటే..!

The Oscar Gift Bag For Nominees

  • అవార్డు రాని వాళ్లకు బహుమతులు
  • ‘ఎవ్రి వన్ విన్స్’ పేరుతో ఇస్తున్న డిస్టింక్టివ్ అస్సెట్స్ కంపెనీ
  • గిఫ్ట్ బ్యాగ్ లో 60 బహుమతులు.. విలువ రూ.1.03 కోట్లు

ఆస్కార్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మన దేశానికి రెండు అవార్డులు వచ్చాయి. అందులో ఒకటి ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు, మరొకటి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కి వచ్చాయి. అయితే నామినేషన్లలో ఉండి.. అవార్డు రాని వారి కోసం ప్రత్యేక బహుమతులు అందిస్తున్నారు.

ఒక్కో గిఫ్ట్ బ్యాగ్ విలువ రూ.1.03 కోట్లు (1.26 లక్షల డాలర్లు) అని ‘ఇండిపెండెంట్’ పత్రిక వెల్లడించింది. ‘‘ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో పోటీ పడి, అవార్డు దక్కని వారికి ఏటా ఈ బహుమతులను అందజేస్తున్నారు’’ అని తెలిపింది.

‘‘లాస్ ఏంజిల్స్ కు చెందిన ‘డిస్టింక్టివ్ అస్సెట్స్’ కంపెనీ ఈ గిఫ్ట్ బ్యాగ్స్ ను అందిస్తోంది. ఈ కంపెనీకి ఆస్కార్ అకాడమీతో ఎలాంటి ఒప్పందం లేదు. అయినప్పటికీ 2002 నుంచి ‘అందరూ గెలుస్తారు (ఎవ్రి వన్ విన్స్)’ పేరుతో ఈ బహుమతులను ఇస్తోంది’’ అని వివరించింది.

‘‘జపాన్ మిల్క్ బ్రెడ్, ఇటాలియన్ ద్వీపానికి వెళ్లేందుకు ట్రిప్, ఆస్ట్రేలియాలో ఒక ప్లాట్.. ఇలా మొత్తం 60 బహుమతులు ఉన్నాయి’’ అని ది గార్డియన్ పత్రిక వెల్లడించింది.

ఈ గిఫ్ట్ బ్యాగ్ లను కచ్చితంగా తీసుకోవాలనే రూల్ ఏమీ లేదు. తమకు అవసరం లేదనుకునే వాళ్లు తిరస్కరించవచ్చు. గతేడాది డెంజెల్ వాషింగ్టన్ తనకు వచ్చిన బహుమతిని తిరస్కరించారు. నటుడు జేకే సిమ్మన్స్.. డొనేట్ చేశారు.

  • Loading...

More Telugu News