Andhra Pradesh: 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ముగిసిన బీఏసీ సమావేశం

AP Assembly sessions to be conducted for 9 days
  • 24వ తేదీ వరకు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
  • 16వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
  • 19, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలకు సెలవు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 16వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 19, 22వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుంది. బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది.

Andhra Pradesh
AP Assembly Session
Budget Session
Cabinet Meeting

More Telugu News