suresh raina: నేను అఫ్రిదీని కాదు.. పునరాగమనంపై రైనా వ్యాఖ్యలు!

raina reacts on re entry in team india

  • ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్’లో ఆడుతున్న రైనా
  • మళ్లీ ఐపీఎల్, టీమిండియాకు ఆడే ఉద్దేశం లేదని పరోక్షంగా వెల్లడి
  • షాహిద్ అఫ్రిదీ మాదిరి రిటైర్మెంట్ వెనక్కి తీసుకోనని వ్యాఖ్యలు

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రస్తుతం ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్’లో ఆడుతున్నాడు. ‘ఇండియా మహారాజాస్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వరల్డ్ జెయింట్స్‌ టీమ్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో అదరగొట్టాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశానికి రైనా హాజరయ్యాడు. ‘అద్భుతంగా ఆడారు.. ఐపీఎల్ లో, టీమిండియా తరపున మీ పునరాగమనాన్ని త్వరలో చూడొచ్చా?’ అని ఓ రిపోర్టర్ అడిగారు. దీనికి రైనా చెప్పిన సమాధానంతో నవ్వులు పూశాయి. 

‘నేను రైనాని.. షాహిద్ అఫ్రిదీని కాదు. ఇప్పటికే రిటైర్ మెంట్ తీసుకున్నాను’ అంటూ చమత్కరించాడు. గతంలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రిది.. కొంతకాలానికి రిటైర్ మెంట్ ని వెనక్కి తీసుకుని పునరాగమనం చేశాడు. ఈ విషయాన్ని పరోక్షంగా రైనా ప్రస్తావించాడు.

టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్ లు రైనా ఆడాడు. ఇక ఐపీఎల్ లో 205 మ్యాచ్ లు ఆడాడు. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.

  • Loading...

More Telugu News