Ram Gopal Varma: నాగార్జున వర్సిటీలో రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ

TDP complains against Ram Gopal Varma to UGC and National Commission for Women
  • నాగార్జున వర్సిటీలో అకడమిక్ ఎగ్జిబిషన్
  • హాజరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
  • విద్యార్థులతో ముఖాముఖి
  • తనదైన శైలిలో హితోపదేశం చేసిన వర్మ
  • వర్మపై తీవ్రస్థాయిలో విమర్శలు
నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. వర్మ వ్యాఖ్యలపై టీడీపీ మహిళా విభాగం మండిపడింది. వర్మపై యూజీసీకి, జాతీయ మహిళా కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది. 

వర్మ వ్యాఖ్యల వీడియోలు, పత్రికా కథనాల క్లిప్పింగ్ లను జతచేసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. వర్మ వ్యాఖ్యలను సమర్థించిన నాగార్జున వర్సిటీ వైస్ చాన్సలర్ పైనా చర్యలు తీసుకోవాలని కోరారు. 

వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. వర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. వర్మ ఫొటోను చెప్పులతో కొడుతూ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు. వర్సిటీ వీసీని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Ram Gopal Varma
Nagarjuna University
TDP
NCW
UGC
Anitha
Andhra Pradesh

More Telugu News