BRS: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవం

BRS candidates unanimously elected in MLA quota MLC elections
  • తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఈ నెల 23న పోలింగ్
  • నేటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
  • తెలంగాణ బరిలో మిగిలింది ముగ్గురే!
  • ముగ్గురూ ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల సంఘం ప్రకటన 
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న జరగాల్సి ఉంది. ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు కాగా, తెలంగాణ బరిలో ముగ్గురే మిగిలారు. 

మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా, స్వతంత్ర అభ్యర్థి పాలమూరి కమల నామినేషన్ చెల్లదని అధికారులు ప్రకటించారు. దాంతో బరిలో మిగిలిన బీఆర్ఎస్ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి, కూర్మయ్యగారి నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఫలితాలలో బీఆర్ఎస్ వర్గాల్లో హర్షం నెలకొంది.
BRS
MLC Elections
MLA Quota
Telangana

More Telugu News