Kim Jong Un: కూతురుతో కలిసి క్షిపణి పరీక్షను వీక్షించిన కిమ్ జాంగ్

Kim Jong Un and Daughter Oversee North Koreas Monster Missile Launch
  • నిన్న హాసాంగ్ - 17 మిస్సైల్ ను పరీక్షించిన ఉత్తర కొరియా
  • ఫొటో విడుదల చేసిన ఉత్తర కొరియా అధికారిక మీడియా
  • రెండో కూతురు జూ ఏ తో కలిసి వీక్షించిన కిమ్ జాంగ్
తన కూతురుతో కలిసి ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ మిస్సైల్ పరీక్షను వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. గురువారం నాడు ఈ ఖండాంతర క్షిపణిని కొరియా ప్రయోగించింది. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా మిలిటరీ డ్రిల్ చేస్తున్న తరుణంతో ఉత్తర కొరియా మిస్సైల్ పరీక్షలను నిర్వహించింది. 

కొరియా పరీక్షించిన మిస్సైల్ పేరు హాసాంగ్-17. తన రెండో కూతురు జూ ఏ తో కలిసి క్షిపణి పరీక్షను కిమ్ జాంగ్ స్వయంగా వీక్షించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెపుతున్నాయి. గురువారం తీసిన ఫొటోలను ఈరోజు విడుదల చేశారు. కిమ్ తన కూతురుతో ఉన్న ఫొటోను మాత్రమే నార్త్ కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది. ఆమె పేరును పేర్కొనలేదు. అయితే, ఆమె రెండో కూతురు జు ఏ అని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ తెలిపింది.
Kim Jong Un
North Korea
Daughter
Missile Launch

More Telugu News