Deva Katta: 'సర్దార్ పాపారాయుడు' చూసి భయపడినవాడిని నేను: సినీ దర్శకుడు దేవ కట్టా
- 'నిజం' టాక్ షోకి వచ్చిన డైరెక్టర్స్
- తనపై బాలచందర్ .. భారతీరాజా ప్రభావం ఉందన్న దేవ కట్టా
- మణిరత్నం - వర్మ ఆలోచింపజేశారని వెల్లడి
- మెగాస్టార్ వల్లనే ఇండస్ట్రీకి వచ్చానన్న సందీప్ రెడ్డి వంగా
దేవ కట్టా సినిమాలు ఆనందింపజేయడమే కాదు .. ఆలోచింపజేస్తాయి కూడా. ఆయన సినిమాల్లో సామాజిక సందేశం తప్పనిసరిగా ఉంటుంది. 'ప్రస్థానం' .. 'రిపబ్లిక్' వంటి సినిమాలు ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడతాయి. అలాంటి దేవ కట్టా .. సందీప్ రెడ్డి వంగాతో కలిసి, 'నిజం' టాక్ షోలో పాల్గొన్నారు. 'సోని లివ్' లో నిన్ననే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది.
దేవ కట్టా మాట్లాడుతూ .. "చిన్నప్పుడు నేను 'సర్దార్ పాపారాయుడు' సినిమాను చూశాను. ఆ తుపాకులు .. ఆ మోతలు చూసి భయంతో థియేటర్ నుంచి పారిపోయానట. ఒక సినిమా అంతగా ప్రభావం చూపుతుందా? అనే ఆలోచన ఆ తరువాత నాకు వచ్చింది" అన్నారు.
" 7వ తరగతి తరువాత నేను మద్రాసు వెళ్లాను. అక్కడ బాలచందర్ .. భారతీరాజా సినిమాలు నాపై ఎక్కువగా ప్రభావం చూపించాయి. ఆ తరువాత మణిరత్నం గారి సినిమాలు .. రామ్ గోపాల్ వర్మ సినిమాలు మరింత ఆసక్తిని పెంచాయి. ఇంజనీరింగ్ కి వచ్చేసరికి సినిమానే నా ప్రపంచమైపోయింది" అని చెప్పుకొచ్చారు. ఇక సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, చిరంజీవిగారి స్ఫూర్తితోనే తాను సినిమాల్లోకి వచ్చినట్టుగా చెప్పారు.