Virender Sehwag: సచిన్ ఫిట్ నెస్ మంత్రమిదే: వీరేందర్ సెహ్వాగ్

Virender Sehwag tells How Sachin Tendulkar Upped His Fitness Game

  • ఆటలో మెరుగుదల కోసం సచిన్ నిరంతరం ఆలోచించే వాడన్న సెహ్వాగ్
  • తమలో అందరికంటే ఎక్కువగా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టేవాడని వెల్లడి 
  • విరాట్ వచ్చాక.. ఫిట్ నెస్ లో అతడితో పోటీ పడేవాడని వ్యాఖ్య

మాస్టర్ బ్లాస్టర్... ఇండియన్ క్రికెట్ లెజెండ్... క్రికెట్ గాడ్... ఇలా ఎన్నో బిరుదులు పొందిన దిగ్గజ బ్యాట్స్ మన్... సచిన్ టెండూల్కర్. సుదీర్ఘ కాలంపాటు కెరియర్ ను కొనసాగించి... టన్నుల కొద్దీ పరుగులు... లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పాడు. రెండు దశాబ్దాలకు పైగా ఫిట్ నెస్ ను కాపాడుకోవడం మామూలు విషయం కాదు. దీనిపై డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేందర్ సెహ్వాగ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

తాజాగా ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడిన సెహ్వాగ్... ఆటలో మెరుగుదల కోసం సచిన్ నిరంతరం ఆలోచించే వాడని, అందుకు తగినట్లు కృషి చేసే వాడని చెప్పాడు. ఫిట్ నెస్ లో విరాట్ కోహ్లీతో పోటీ పడేవాడని తెలిపాడు.

‘‘సచిన్ ఇంకొన్నేళ్లు క్రికెట్ ఆడగలడని అందరూ ఎందుకు అనుకునే వాళ్లో తెలుసా? తన బ్యాటింగ్ ను ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై ప్రతి ఏటా తన ఆటతీరును సమీక్షించుకునేవాడు. ఒకవేళ బ్యాటింగ్ లో మార్చుకోవడానికి ఏమీ లేకపోతే... సెంచరీలను డబుల్ సెంచరీలుగా మార్చేందుకు అవసరమైన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టేవాడు’’ అని సెహ్వాగ్ వివరించాడు.
 
‘‘2000 సంవత్సరంలో సచిన్ మా అందరికంటే ఎక్కువగా ఫిట్ నెస్ పై దృష్టిపెట్టేవాడు. 2008 తర్వాత విరాట్ వచ్చాక... అతడితో పోటీ పడ్డాడు’’అని తెలిపారు. నిజానికి కోహ్లీ కంటే ఎక్కువ ఫోకస్ పెట్టాడని చెప్పాడు.

2013లో అంతర్జాతీయ క్రికెట్ కు సచిన్ వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్ ఆయనే. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. వన్డేల్లో తొలి ‘డబుల్ సెంచరీ’ సచిన్ చేసినదే. దాదాపు 24 ఏళ్ల కెరియర్ లో 6 ప్రపంచ కప్ లు ఆడాడు.

  • Loading...

More Telugu News