Aishwaryaa Rajinikanth: ఐశ్వర్యా రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ

Aishwaryaa Rajinikanth files complaint after 60 sovereigns of jewellery gets stolen

  • చెన్నైలోని ఆమె నివాసంలో లాకర్ లోని నగలు మాయం
  • తేయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు
  • పనివారిపై అనుమానం వ్యక్తం చేసిన ఐశ్వర్య

తమిళ అగ్ర నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 60 సవర్ల బంగారం (480 గ్రాములు/48 తులాలు), వజ్రాభరణాల జ్యుయలరీ చోరీకి గురైనట్టు తెయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్ లో ఉంచినవి కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. 2019లో జరిగిన తన సోదరి సౌందర్ వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు తెలిపారు. ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని పేర్కొన్నారు. 

ఐశ్వర్య తన ఇంటిలోని లాకర్ లో ఉంచగా, ఈ విషయం కొంత మంది పనివారికి తెలుసునని ఎఫ్ఐఆర్ కాపీ చెబుతోంది. సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ లాకర్ ను ఆమె పలు సందర్భాల్లో వేర్వేరు ఇళ్లకు తరలించినట్టు వివరించారు. 2022 ఏప్రిల్ లో పోయస్ గార్డెన్ లోని నివాసానికి లాకర్ ను తరలించారు. 

ఫిబ్రవరి 18న ఆమె లాకర్ ను తెరిచి చూడగా, తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించి షాక్ అయ్యారు. డైమండ్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు పోయిన వాటిల్లో ఉన్నాయి. తన దగ్గర పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్ పై అనుమానం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News