Nara Devansh: దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి

Lokesh and Brahmani donates huge amount to TTD on Devansh birthday
  • నేడు నారా దేవాన్ష్ పుట్టినరోజు
  • టీటీడీ అన్న ప్రసాద వితరణ కోసం విరాళం ప్రకటించిన లోకేశ్, బ్రాహ్మణి
  • విరాళం టీటీడీ అధికారులకు అందజేత 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు. తిరుమల కొండపై ఒకరోజు అన్న ప్రసాద వితరణ కోసం రూ.33 లక్షలను టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు. 

ఇది భారీ డొనేషన్ కావడంతో తిరుమలలో ఎలక్ట్రానిక్ డిస్ ప్లే స్క్రీన్లపై దీన్ని ప్రదర్శించారు. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకు టీటీడీ అన్న ప్రసాద వితరణ కోసం లోకేశ్ కుటుంబం భారీ విరాళం ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది.
Nara Devansh
Birthday
Nara Lokesh
Brahmani
Donation
TTD
Tirumala
TDP
Andhra Pradesh

More Telugu News