Hema: పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ

Hema complains against some youtube channels and websites
  • తప్పుడు థంబ్ నెయిల్స్ పెడుతున్నారని హేమ ఆరోపణ
  • అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • బతికున్నవాళ్లను కూడా చంపేస్తున్నారని హేమ ఆవేదన
  • న్యాయపోరాటానికి కూడా సిద్ధమేనని వెల్లడి
మూడేళ్ల నాటి ఫొటోలతో తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై టాలీవుడ్ నటి హేమ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల కిందట పెళ్లి రోజు వేడుకల సందర్భంగా భర్తతో ఉన్న ఫొటోలను ఇప్పుడు మరోసారి పోస్టు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హేమ ఆరోపించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేసేందుకు కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. 

సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసే యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. కొందరు సినీ ప్రముఖులు బతికే ఉన్నప్పటికీ, వారు చనిపోయారంటూ డబ్బుల కోసం అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఉదాహరణగా కోట శ్రీనివాసరావు అంశాన్ని ప్రస్తావించారు. కోట ఇక లేరంటూ తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు.
Hema
Cyber Crime
Youtube Channels
Websites
Hyderabad
Tollywood

More Telugu News