Stock Market: వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock market ended with profits once again

  • అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు
  • ఒడిదుడుకులు లేకుండా సాగిన భారత మార్కెట్ సూచీలు
  • 139 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 44 పాయింట్ల లాభపడిన నిఫ్టీ

భారత స్టాక్ మార్కెట్ మరోసారి లాభాలతో ముగిసింది. వరుసగా రెండో రోజు కూడా దేశీయ మార్కెట్ సూచీలు సానుకూల ఫలితాలు అందుకున్నాయి. సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 58,214 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 17,151 వద్ద ముగిసింది.

ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగడంతో, ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పైనా కనిపించింది. ఉదయం నుంచి ట్రేడింగ్ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై నేడు కీలక ప్రకటన చేయనుందన్న సమాచారంతో మదుపరులు జాగ్త్రత్తగా ట్రేడింగ్ జరిపారు. 

సన్ ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్ సర్వ్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు లాభాలు అందుకున్నాయి. అదానీ గ్రూప్ కు చెందిన పలు సంస్థల షేర్లు కూడా లాభాల బాటలో పయనించాయి. 

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్, ఎస్ బీఐ, కోటక్ మహీంద్రా తదితర షేర్లు నష్టాలు చవిచూశాయి.

  • Loading...

More Telugu News