Amritpal Singh: యువతులు, వివాహితులతో అమృత్ పాల్ సింగ్ చాటింగ్, ఫోన్ కాల్స్

Amritpal Singh chats audio tapes with multiple women accessed
  • ప్రేమ పేరుతో దగ్గరై, సన్నిహితంగా గడిపే ఖలిస్థానీ నేత
  • అశ్లీల వీడియోలు తీసి బెదిరించినట్టు పోలీసులకు ఆధారాలు
  • మహిళలతో చిన్నపాటి రిలేషన్ షిప్ వరకేనన్న అమృత్ పాల్ సింగ్
వేర్పాటు వాద నేత, ప్రత్యేక ఖలిస్థాన్ ఉద్యమకారుడు, పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ రాసలీలలు వెలుగు చూశాయి. పలువురు మహిళలతో అమృత్ పాల్ నిర్వహించిన సంభాషణలు, చాటింగ్ వివరాలను పోలీసులు సంపాదించారు. పెళ్లికాని యువతులు, వివాహితులతోనూ అతడు చాటింగ్ చేసినట్టు గుర్తించారు. అంతేకాదు, అశ్లీల వీడియోలతో తనతో సంభాషణలు, సంబంధాలు నెరిపిన మహిళలను అతడు బెదిరించినట్టు తెలిసింది.

యువతులు, వివాహితులతో పోర్నోగ్రఫీ వీడియోలు తీయించి బ్లాక్ మెయిల్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో దగ్గరై, వారితో సన్నిహితంగా గడిపి, వీడియోలు తీసి బెదిరించే వాడని తెలిసింది. తన దగ్గర ఓ యువతికి సంబంధించి అశ్లీల వీడియో ఉందని, దాన్ని వైరల్ చేస్తానంటూ ఫోన్ లో మాట్లాడుతున్న సంభాషణలు కూడా బయటకు వచ్చాయి. ‘‘మహిళలు చాలా తొందరగా అనుబంధం ఏర్పరుచుకుంటారు. కానీ, నేను అలాంటి బంధాల్లోకి దిగాలని అనుకోవడం లేదు. నాకు కావాల్సింది చిన్నపాటి రిలేషన్ షిప్. అంతవరకే మంచిది’’ అంటూ అతడు మాట్లాడిన టేప్ లు కూడా బయటపడ్డాయి. 

సోషల్ మీడియా ద్వారా అతడు మహిళలకు దగ్గరయ్యే వాడని పోలీసులు తెలుసుకున్నారు. ఇటీవల పంజాబ్ లో అల్లర్ల నేపథ్యంలో, ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టు సందేహాలతో అతడిపై కేసులు నమోదు కావడం తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సైతం ఈ కేసులో చురుగ్గా పనిచేస్తోంది. పారిపోయిన అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు వేట విస్తృతం చేశారు. కానీ, అతడు దేశం దాటి పాకిస్థాన్ పారిపోయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.
Amritpal Singh
Khalistani
chat
women
girls
relationship
obscene videos
blackmail

More Telugu News