Telangana: అలెర్ట్! తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

Rain with hailstones Expected today and tomorrow in Telangana
  • తెలంగాణలో మారిన వాతావరణం
  • నిన్న పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు
  • అకాల వర్షాలకు దెబ్బతింటున్న పంటలు
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వాతావరణం మారిపోయింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ వాతావరణాన్ని చల్లబరిచాయి. ద్రోణి ప్రభావం కొనసాగుతుండడమే ఇందుకు కారణం. తాజాగా, వాతావరణశాఖ మరోమారు హెచ్చరికలు చేసింది. 

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నిన్న ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని పంటలు దెబ్బ తిన్నాయి.
Telangana
Rains
Temperature
Summer Rains

More Telugu News