Deepika Padukone: భర్త చేయి అందిస్తున్నా.. స్వీకరించని దీపిక పదుకొణె

Deepika Padukone ignores Ranveer Singh as he holds out his hand at event
  • ముంబైలోని ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ కార్యక్రమానికి హాజరైన జంట
  • రెడ్ కార్పెట్ పై నడిచే క్రమంలో చేయి అందించిన రణవీర్
  • పట్టించుకోకుండా వెళ్లిపోయిన దీపిక 
  • మండి పడుతున్న అభిమానులు
భర్త చేయి పట్టుకుని నడవడం అంటే చాలా మంది మహిళలు ఇష్టపడతారు. బాలీవుడ్ స్టార్స్ కపుల్ అయిన దీపిక పదుకొణె, రణవీర్ సింగ్ మధ్య కూడా ఇలాంటి సన్నివేశం చోటు చేసుకునేదే. కానీ అది సాధ్యపడలేదు. ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ నాలుగో ఎడిషన్ కార్యక్రమం గురువారం ముంబైలో జరిగింది. దీనిలో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంగా తన భార్య దీపిక చేయి పట్టుకుని నడిచేందుకు రణవీర్ సింగ్ ఆసక్తి చూపించారు.

ముందుగా కారు దిగి వచ్చిన రణవీర్ రెడ్ కార్పెట్ పై దీపిక కోసం వేచి చూశారు. దీపిక వచ్చిన తర్వాత చేయి చాచినప్పటికీ.. దాన్ని చూడనట్టుగానే దీపిక పదుకొణె ముందుకు అడుగులు వేసింది. దీంతో రణవీర్ సింగ్ చేసేదేమీ లేక చేయి కిందకు దించేసి ముందుకు సాగిపోయాడు. ఈ వీడియో క్లిప్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. వారి బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈ కార్యక్రమానికి ముందు వారి మధ్య ఫైటింగ్ జరిగి ఉండొచ్చని ఓ యూజర్ కామెంట్ చేయడం గమనించొచ్చు. దీపిక తన చర్య ద్వారా రణవీర్ ను అగౌరవ పరిచిందని.. రణవీర్ కంటే తానే పెద్ద స్టార్ అనే భావన ఆమెలో ఉందని మరో యూజర్ పేర్కొనడం గమనార్హం. (ఇన్ స్టా వీడియో కోసం)
Deepika Padukone
Ranveer Singh
holds out his hand
fans

More Telugu News