Mark Zuckerberg: మరోసారి తండ్రయిన మార్క్ జుకర్ బర్గ్

Mark Zuckerberg and his wife welcomes third child
  • మూడోసారి కూడా జుకర్ బర్గ్ కు కుమార్తే!
  • అరేలియా చాన్ జుకర్ బర్గ్ అని నామకరణం
  • ఇప్పటికే జుకర్ బర్గ్, ప్రిసిల్లా చాన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు
  • 2012లో ప్రేమ వివాహం చేసుకున్న జుకర్ బర్గ్, ప్రిసిల్లా
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తండ్రయ్యారు. జుకర్ బర్గ్ అర్ధాంగి ప్రిసిల్లా చాన్ మూడో కుమార్తెకు జన్మనిచ్చింది. మూడోసారి కూడా అమ్మాయే పుడుతుందని జుకర్ బర్గ్ కొన్నినెలల కిందటే ప్రకటించారు. అమెరికాలో లింగనిర్ధారణ పరీక్షలు నేరం కాదు. 

కాగా, మరోసారి అమ్మాయి పుట్టడం పట్ల జుకర్ బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. తన కుమార్తె పేరు అరేలియా చాన్ జుకర్ బర్గ్ అని వెల్లడించారు. 'ప్రపంచంలోకి స్వాగతం అరేలియా చాన్ జుకర్ బర్గ్..' అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ మేరకు కుమార్తెను మురిపెంగా చూస్తున్న ఫొటోను కూడా జుకర్ బర్గ్ పంచుకున్నారు. 

మార్క్ జుకర్ కాలేజీ మేట్ అయిన ప్రిసిల్లా చాన్ ను ప్రేమించి పెళ్లాడారు. వీరి వివాహం 2012లో జరిగింది. ఈ జంటకు ఇప్పటికే మ్యాక్సిమా, ఆగస్ట్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Mark Zuckerberg
Arelia
Daughter
Facebook

More Telugu News