moon: ఆకాశంలో అందమైన దృశ్యం

Almost chandrabindoo Rare Moon Venus conjunction leaves Twitter in awe Did you see it
  • చంద్రుడు, శుక్రుడు సమీపానికి
  • చంద్రుడి నెత్తిన శుక్రుడు
  • ఫొటోని షేర్ చేసిన నాసా
  • నేడు కూడా చూడొచ్చని సూచన
పరమేశ్వరుడిని పరిశీలించి చూడండి. ఆయన తలపై చంద్రుడు కొలువుదీరి ఉంటాడు. అచ్చంగా అదే మాదిరి చంద్ర రూపాన్ని ఆకాశంలో చూస్తూనే ఉంటాం. కానీ, ఇప్పుడు ఈ చంద్రుడిపై బొట్టు పెట్టిన మాదిరిగా శుక్ర నక్షత్రం వచ్చి చేరితే...? అది అద్భుతం. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. పరమేశ్వరుడు సైతం ఈ రూపాన్ని చూసి ఆనందించే మాదిరిగా నింగిలో దృశ్యం శుక్రవారం ఆవిష్కృతమైంది.

ఈ రెండు గ్రహాలు ఒకటే సమలేఖనం పైకి వచ్చాయి. చంద్రుడి నుదుట తిలకం దిద్దిన మాదిరిగా శుక్రుడు కనిపిస్తున్నాడు. నెటిజన్లు దీన్ని ఆభరణంగా, చంద్ర బిందువుగా అభివర్ణిస్తున్నారు. చిరకాల ప్రేమికులు చేరువ అయ్యారని వ్యాఖ్యానిస్తున్న వారు కూడా ఉన్నారు. చంద్రుడు భూమికి సమీపంగా ఉండడంతో మరింత ప్రకాశవంతం గా కనిపిస్తున్నాడు. నేడు కూడా ఈ దృశ్యం కనిపిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత నింగి వైపు చూస్తే చాలు. కాకపోతే శుక్రుడి సమీపానికి చంద్రుడు చేరుకున్న సమయంలో చూడాలి.
moon
venus
nearbuy
same line
sky
nasa

More Telugu News