loneliness: ఒంటరి తనంతో వచ్చే వ్యాధులు ఇవే..!

 serious health issues that can be triggered by loneliness

  • ఒంటరిగా ఉండే వారిలో వ్యాకులత, ఒత్తిడి
  • దీని కారణంగా హార్మోన్లలో మార్పులు
  • ఫలితంగా పలు వ్యాధుల రిస్క్
  • రక్తపోటు, గుండె పోటు, స్ట్రోక్, కేన్సర్ రావొచ్చు

మనిషి సంఘజీవి. ఒంటరి జీవి ఎప్పుడూ కాదు. అడవిలో అయినా సరే జంతువులు ఒక సమూహంగానే ఉంటుంటాయి. కానీ, నేడు సామాజిక సంబంధాలు అంత బలంగా ఉండడం లేదు. ఇది ఎంతో మందిని ఒంటరిని చేసేస్తోంది. ఒంటరి తనానికి ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య కారణాలు కూడా ఉంటుంటాయి. అందరినీ స్నేహితులుగా మలుచుకోకపోయినా సరే, కొందరు స్నేహితులు, సన్నిహితులు అయినా ఉండాలి. కారణం ఏదైనా ఒంటరి తనం వేధిస్తున్నట్టు అయితే దాన్నుంచి బయటపడాలి. బంధువులు, తమతో కలసి చదువుకున్న వారిని పలకరిస్తూ, కలుస్తూ ఉండాలి. క్లబ్ లో చేరొచ్చు. వాలంటీర్ గా చేసి సేవలు చేయడం ద్వారా పరిచయాలు పెంచుకోవచ్చు.

‘‘ఒంటరితనం ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అన్నవి నాణేనికి ఒకవైపే ఉండేవే. ఎంతో మంది సైకోసోమటైజేషన్ తో  ఆసుపత్రులకు వస్తుంటారు. అంటే వారిలో శారీరక సమస్యలు ఉండవు. ఉండేవి మానసికపరమైనవే’’ అన్నది నిపుణులు చెబుతున్న మాటలు.

డిస్తిమియా లేదా పర్సిస్టెంట్ డిప్రెషన్
ఒంటరితనం వల్ల వచ్చే సమస్యల్లో ఇది ప్రధానమైనది. ఈ సమస్యతో బాధపడేవారు రోజంతా ఒంటరిగా ఉంటూ కుంగుబాటుకు, వ్యాకులతకు గురవుతుంటారు. ఇది తీవ్రమైన సమస్యే. చికిత్స తీసుకోకపోతే తమపై తాము నమ్మకం కోల్పోతారు. 

సామాజిక ఆందోళన
ఈ సమస్య ఉన్న వారు ఇతరులతో కలవడానికి ఆందోళన చెందుతుంటారు. ఇతరులతో కలవాల్సి వచ్చినప్పుడు ఆందోళన, భయం, నిస్పృహ ఆవరిస్తాయి. అందుకే ఒంటరిగా ఉండటానికి మొగ్గు చూపుతారు.

దీర్ఘకాలిక వ్యాధులు
అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్, స్థూలకాయం తదితర సమస్యలను ఒంటరిగా ఉండే ఎక్కువ మందిలో గమనించొచ్చు. హార్ట్ ఎటాక్ రిస్క్ 29 శాతం, స్ట్రోక్ రిస్క్ 32 శాతం అధికంగా వీరికి ఉంటుంది.

కేన్సర్
ఒంటరితనంతో దిగులు పడేవారు, మానసిక వ్యాకులతకు లోనయ్యే వారిలో ఒత్తిడి స్థాయులు పెరిగిపోతాయి. దీంతో హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా అనారోగ్యంపై పోరాడే వ్యాధి నిరోధక సామర్థ్యం బలహీనపడుతుంది. కేన్సర్ కు దారితీయవచ్చు.

మధుమేహం
ఒంటరితనంతో టైప్2 మధుమేహం రిస్క్ కూడా ఉంటుంది. ఒత్తిడి, ఒంటరితనం రిస్క్ ను పెంచుతాయి. అలాగే, అధిక బరువు, జీవనశైలి సమస్యలు కూడా దీనికి కారణమవుతాయి.

  • Loading...

More Telugu News