Somu Veerraju: దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలనడం సరికాదు: సోము వీర్రాజు

Somu Veerraju says it is not appropriate that Dalit Christians inclusion in SC category
  • దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చడంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్ 
  • తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని వెల్లడి
  • ఏపీ ప్రభుత్వ తీర్మానాన్ని ఖండిస్తున్నామన్న సోము వీర్రాజు
దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చే తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్టు సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించడంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలనడం సరికాదని అన్నారు. ఏపీ ప్రభుత్వ తీర్మానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ చర్యలు మతమార్పిడులను ప్రోత్సహించేలా ఉన్నాయని సోము వీర్రాజు విమర్శించారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలపై ఈ నెల 27న గవర్నర్ ను కలుస్తామని వెల్లడించారు.
Somu Veerraju
Dalit Christians
SC
Jagan
Assembly
YSRCP

More Telugu News