Bandi Sanjay: టీఎస్ పీఎస్పీ ప్రశ్నాపత్రాల లీక్ కేసు... నేటి సిట్ విచారణకు బండి సంజయ్ దూరం

Bandi Sanjay likely skip SIT questioning

  • తెలంగాణలో కలకలం రేపిన ప్రశ్నాపత్రాల లీక్
  • పలు వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
  • బండి సంజయ్ ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలన్న సిట్
  • బండి సంజయ్ కి నోటీసులు
  • నేడు బండి సంజయ్ బదులు సిట్ ముందుకు రానున్న బీజేపీ లీగల్ టీమ్

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి సిట్ నోటీసులు పంపడం తెలిసిందే. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే సమర్పించాలని సిట్ ఆ నోటీసుల్లో కోరింది. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం బండి సంజయ్ నేడు సిట్ ఎదుటకు రావాల్సి ఉంది. 

అయితే, నేటి సిట్ విచారణకు బండి సంజయ్ దూరం కానున్నారు. బండి సంజయ్ తరఫున సిట్ ముందుకు బీజేపీ లీగల్ టీమ్ రానుంది. బండి సంజయ్ నేడు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి అమిత్ షాతో కలిసి బీదర్ సభలో పాల్గొనాల్సి ఉంది. 

కాగా, టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులకు పోలీస్ కస్టడీ విధించారు. నిందితులకు నేటి నుంచి మూడు రోజుల పాటు సిట్ కస్టడీ అమలు కానుంది. ఈ కేసులో ప్రవీణ్ (ఏ1), రాజశేఖర్ (ఏ2), ఢాక్యా (ఏ4), కేతావత్ రాజేశ్వర్ (ఏ5)లను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు సిట్ కు అనుమతించింది. పేపర్ లీక్ కేసులో సిట్ ఇప్పటివరకు మొత్తం 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News