Vijayasai Reddy: ఏపీలో భారీ బడ్జెట్ సినిమాల షూటింగులు పెరగడం హర్షణీయం: విజయసాయిరెడ్డి

Vijayasaireddy says number of high budget movie shootings in AP raised
  • ఏపీలో భారీ బడ్జెట్ చిత్రాల షూటింగులు
  • సీఎం జగన్ నిర్ణయమే కారణమన్న విజయసాయి
  • అధిక ఫీజులు చెల్లించాల్సిన అవసరంలేదని వెల్లడి
ఏపీలో భారీ బడ్జెట్ చిత్రాల షూటింగులు ఇటీవలకాలంలో పెరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇది సంతోషించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు. ఏపీలో పెద్ద సినిమాల చిత్రీకరణలు పెరగడానికి కారణం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమేనని వెల్లడించారు. 

అధిక ఫీజులు చెల్లించనవసరం లేకుండా రాష్ట్రంలో షూటింగులు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారని విజయసాయిరెడ్డి కొనియాడారు. సినిమా షూటింగుల్లో పెద్ద సంఖ్యలో కార్మికుల అవసరం ఉంటుందని, వందల సంఖ్యలో ప్రజలకు ఉపాధి కలుగుతుందని వివరించారు. ముఖ్యంగా, స్థానికులకు లబ్ది చేకూరుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Vijayasai Reddy
Shootings
High Budget
CM Jagan
Cinema
YSRCP
Tollywood

More Telugu News