Issy Wong: ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్... డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ విలవిల

Issy Wong sensational bowling makes troubles for Delhi Capitals in WPL final
  • నేడు డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్
  • ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • 3 వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టిన ఇస్సీ వాంగ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆఖరి అంకానికి చేరుకుంది. ఇవాళ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ను ముంబయి ఇండియన్స్ సంచలన పేసర్ ఇస్సీ వాంగ్ హడలెత్తించింది. 

మొన్న ఎలిమినేటర్ మ్యాచ్ లో హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీసిన ఇస్సీ వాంగ్ ఇవాళ తొలి స్పెల్ లోనూ నిప్పులు చెరిగే బౌలింగ్ తో 3 వికెట్లు తీయడం విశేషం. వాంగ్ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో మూడో బంతికి విధ్వంసక ఓపెనర్ షెఫాలీ వర్మ (11)ను అవుట్ చేసిన వాంగ్... అదే ఓవర్లో ఐదో బంతికి ఆలిస్ కాప్సేని డకౌట్ చేసి ముంబయి ఇండియన్స్ శిబిరంలో మరింత ఉత్సాహం నింపింది. ఆ తర్వాత, ఫామ్ లో ఉన్న జెమీమా రోడ్రిగ్స్ (9) ను కూడా అవుట్ చేసి ముంబయిని దెబ్బకొట్టింది. 

ప్రస్తుతం ముంబయి స్కోరు 7 ఓవర్లలో 3 వికెట్లకు 48 పరుగులు. కెప్టెన్ మెగ్ లానింగ్ 26, మరిజేన్ కాప్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Issy Wong
Mumbai Indians
Delhi Capitals
Final
WPL

More Telugu News