Keeravani: రామ్ గోపాల్ వర్మనే నా మొదటి ఆస్కార్: కీరవాణి

Ram Gopal Varma is my first Oscar says Keeravani

  • 'క్షణక్షణం' చిత్రం ద్వారా ఆర్జీవీ తనకు అవకాశం ఇచ్చారన్న కీరవాణి
  • ఆ తర్వాతే  తనకు అవకాశాలు వచ్చాయని వెల్లడి
  • వర్మతో పని చేయడం తన జీవితంలో కీలక మలుపు అని వ్యాఖ్య

'నాటు నాటు' పాట ద్వారా మన దేశానికి ఆస్కార్ తీసుకొచ్చిన సంగీత మేధావి కీరవాణి. తాజాగా ఈ పాటకు ఆస్కార్ రావడంపై ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన తొలి ఆస్కార్ గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మను భావిస్తానని చెప్పారు. తొలి నాళ్లలో అవకాశాల కోసం తిరుగుతూ తాను ఎంతో మందిని కలిశానని... ఎవరూ అవకాశం ఇవ్వలేదని, అన్ని చోట్ల తిరస్కారాలే ఎదురయ్యేవని తెలిపారు. ఆ సమయంలో 'క్షణక్షణం' సినిమాకు పని చేసే అవకాశాన్ని రామ్ గోపాల్ వర్మ తనకు ఇచ్చారని... అప్పటికే 'శివ' సినిమా కారణంగా ఆయన పేరు మారుమోగుతోందని చెప్పారు. 

'క్షణక్షణం' సినిమా టైమ్ కి తాను ఎవరికీ తెలియదని... కానీ వర్మ తనకు అవకాశం ఇవ్వగానే తనలో ఏదో ట్యాలెంట్ ఉందని అందరూ భావించారని కీరవాణి చెప్పారు. ఆ సినిమా హిట్ కావడంతో తనకు వరుస అవకాశాలు వచ్చాయని... వర్మతో పని చేయడం తన జీవితంలో కీలక మలుపు అని అన్నారు. 

చనిపోయానని ఫీలవుతున్నా.. వర్మ! 

మరోవైపు కీరవాణి వ్యాఖ్యలపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. కీరవాణి మాటలు వింటుంటే తాను చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోందని... ఎందుకంటే చనిపోయిన వారిపైనే ఇంత గొప్పగా ప్రశంసలు కురుస్తాయని సరదాగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News