RRR: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ ఖర్చు అంతేనా!

RRR Line Producer SS Karthikeya reveales the cost of the Oscar campaign
  • రూ.80 కోట్లు ఖర్చు చేశారని వార్తలు
  • వాటిని ఖండించిన లైన్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ
  • మొత్తం ఖర్చు రూ. 8.5 కోట్లు అని వెల్లడి
దర్శక దిగ్గజం ఎస్‌ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచాన్ని ఊపేసింది. ముఖ్యంగా నాటు నాటు పాట ఈ సినిమాకు ఊహించని కీర్తిని తీసుకొచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ఆస్కార్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇందుకోసం ఎస్‌ఎస్. రాజమౌళి రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేశారన్న పుకార్లు వచ్చాయి. కోట్లు పోసి ఆస్కార్ తెచ్చుకున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. వీటిని ఖడించిన ‘ఆర్ఆర్ఆర్’ లైన్ ప్రొడ్యూసర్ ఎస్‌ఎస్‌.కార్తికేయ ప్రమోషన్స్ ఖర్చుపై స్పష్టతనిచ్చారు. 

‘అమెరికన్ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్‌ వెర్షన్‌లో ఆర్ఆర్ఆర్ ని ఒక్క శుక్రవారం విడుదల చేయాలనుకున్నాం. కానీ, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ఆ ఒకరోజు కాస్తా నెల అయింది. భారత్ నుంచి అధికారికంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ కు ఆస్కార్‌ ఎంట్రీ లభించనప్పుడు కాస్త బాధగా అనిపించింది. అందువల్ల ఆస్కార్ కోసం సొంతంగా దరఖాస్తు చేశాం. కీరవాణి, చంద్రబోస్‌ నామినేషన్‌లో ఉన్నారు. ఆస్కార్స్ టిక్కెట్స్ కోసం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఆస్కార్‌ కమిటీకి మెయిల్‌ చేయాలి. మా ఫ్యామిలీ కోసం ఒక్కో టికెట్‌ 1500 డాలర్లు పెట్టి కొన్నాం. మరో నలుగురి కోసం 750 డాలర్లు పెట్టి కొన్నాం. బయట వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారం కోసం మేము అనుకున్న బడ్జెట్‌ రూ.5 కోట్లు. నామినేషన్స్‌ వచ్చిన తర్వాత మరికొంత బడ్జెట్‌ పెంచాం. చివరకు రూ.8.5 కోట్లు అయింది. అకాడమీ వోటర్స్‌కు సినిమాపై ఆసక్తి పెంచడంలో మాకు మూడు పీఆర్ సంస్థలు కీలకంగా పని చేశాయి’ అని చెప్పుకొచ్చాడు.
RRR
naatu naatu
oscar
Oscar campaign
ss kartikeya
cost

More Telugu News