PAN: పాన్-ఆధార్ అనుసంధానానికి మరోసారి గడువు పెంచిన కేంద్రం

Center extends PAN and AADHAR link up dead line
  • పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాల్సిందేనంటున్న కేంద్రం
  • ఇప్పటికే పలు దఫాలుగా గడువు పెంపు
  • పాత గడువు మార్చి 31తో ముగియనున్న వైనం
  • కొత్తగా జూన్ 30 వరకు గడువు పొడిగింపు
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి అని కేంద్రం ఎప్పటినుంచో చెబుతోంది. ఆ మేరకు పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది. తాజాగా పాన్-ఆధార్ అనుసంధానానికి కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. గతంలో విధించిన గడువు మార్చి 31న ముగియనుంది. ఈసారి మరో మూడు నెలలు పొడిగిస్తూ, జూన్ 30న తుది గడువు అని పేర్కొంది. అందుకు అపరాధ రుసుము రూ.1000 అని తెలిపింది. అప్పటిలోగా పాన్ తో ఆధార్ అనుసంధానించకపోతే జులై 1 నుంచి పాన్ కార్డు పనిచేయదు. 

చెల్లుబాటు కాని పాన్ తో బ్యాంకు అకౌంట్లు, డీమ్యాట్ అకౌంట్లు తెరవడం సాధ్యం కాదు. మ్యూచువల్ ఫండ్ లు తీసుకునేందుకు కూడా నిబంధనలు అంగీకరించవు. కాగా, పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును పెంచినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వివరించింది.
PAN
AADHAR
Link Up
Dead Line
India

More Telugu News