Atiq Ahmed: మరో రెండు వారాల్లో నన్ను చంపేస్తారు.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ సోదరుడు

I Will be killed in 2 weeks Say Atiq Ahmeds brother Ashraf

  • ఉమేశ్ పాల్ హత్యకేసులో అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు
  • ఆయన సోదరుడు అష్రఫ్ సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
  • రెండు వారాల్లో జైలు నుంచి తరలించి చంపేస్తానని సీనియర్ అధికారి ఒకరు బెదిరించారని ఆరోపణ
  • ఆయన పేరును సీఎం యోగికి, సుప్రీం సీజేఐకి, అలహాబాద్ హైకోర్టు సీజేకి చెబుతానన్న వైనం

గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2006 ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో నిర్దోషులుగా బయటపడిన ఏడుగురిలో అష్రఫ్ కూడా ఒకరు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. మరో రెండు వారాల్లో తనను చంపేస్తారని, సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు హెచ్చరించారని ఆరోపించారు. అష్రఫ్‌ను మంగళవారం బరేలీ జైలుకు తరలించగా, ఆయన సోదరుడు అతీక్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించారు.

బరేలీ జైలుకు తరలిస్తున్న సమయంలో అష్రఫ్ మాట్లాడుతూ.. తనను మరో రెండు వారాల్లో జైలు నుంచి బయటకు తరలించి చంపేస్తారని ఆరోపించారు. తనను చంపేస్తానని సీనియర్ అధికారి ఒకరు బెదిరించారని అన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పైనా తప్పుడు కేసులు పెట్టారని, కాబట్టి తన బాధను ఆయన అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తనకొచ్చిన బెదిరింపుపై అష్రఫ్ మాట్లాడుతూ.. ఓ సీనియర్ అధికారి తనను బెదిరించారని, ఆయన పేరును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు, భారత ప్రధాన న్యాయమూర్తికి, అలహాబాద్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెబుతానన్నారు. 

అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్ కి చెందిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కు ప్రయాగ్ రాజ్ కోర్టు నిన్న జీవిత ఖైదు విధించింది. 2006లో ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయన సోదరుడు ఖలీద్ అహ్మద్ అలియాస్ అష్రఫ్ అహ్మద్ సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. అతీక్‌పై 100కుపైగా కేసులు ఉండగా ఆయన దోషిగా తేలిన తొలి కేసు ఇదే.

  • Loading...

More Telugu News