Mahesh Babu: సోషల్ మీడియాలో తిరుగులేని మహేశ్ బాబు

Mahesh Babu record in Social Media
  • మహేశ్ బాబుకు ఫేస్ బుక్ లో 15 మిలియన్ల ఫాలోవర్లు
  • ట్విట్టర్ లో 13.2 మిలియన్లు
  • ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్లు
  • ఓవరాల్ గా 38.3 మిలియన్లు
  • సౌత్ లో మరే హీరోకు దక్కని ఘనత
  • ప్రతి సోషల్ మీడియా వేదికలోనూ మహేశ్ కు కోటికి పైగా ఫాలోవర్లు
దక్షిణాది అగ్రశ్రేణి హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఒకరు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సోషల్ మీడియాలో కూడా మహేశ్ బాబు దూసుకెళుతున్నారు. దక్షిణాదిన అత్యధిక ఫాలోవర్లు ఉన్న హీరోగా రికార్డు సృష్టించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికల్లో ఆయనకు మొత్తం 38.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్ల మంది మహేశ్ బాబును అనుసరిస్తున్నారు. ప్రతి సోషల్ మీడియా వేదికపైనా మహేశ్ కు కోటికి తక్కువ కాకుండా ఫాలోవర్లు ఉండడం విశేషం. మరే సౌత్ హీరోకు ఈ స్థాయిలో ఫాలోవర్లు లేరు. ఈ రికార్డుతో సూపర్ స్టార్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు.
Mahesh Babu
Record
Followers
Social Media
Tollywood

More Telugu News