rains: తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు

Isolated rains forecast in Telangana for four days

  • కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం 
  • రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఎండ

తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండ పెరుగుతూ ఉండగా.. వర్షాలు కూడా పడుతున్నాయి. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి ఆదివారం దాకా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గురు, శుక్రవారాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపింది. 

అదే సమయంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.  బుధవారం నిజామాబాద్, నిర్మల్, నాగర్కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ లోని జక్రాన్ పల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని జిల్లాల్లో ఎండ 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

  • Loading...

More Telugu News