Elon: బరాక్ ఒబామాను అధిగమించేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌లో ఆయనే ఫస్ట్!

Elon Musk becomes the most followed person on Twitter

  • రెండో స్థానానికి పడిపోయిన బరాక్ ఒబామా
  • మస్క్‌కు రోజుకు లక్షమంది కొత్త యూజర్ల చేరిక
  • ట్విట్టర్ మొత్తం యూజర్లలో 30 శాతానికి పైగానే మస్క్‌ను  అనుసరిస్తున్న వైనం
  • 133.1 మిలియన్ల మందితో ఫాలోవర్లలో అగ్రస్థానం

ట్విట్టర్ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోమారు రికార్డులకెక్కారు. ట్విట్టర్‌లో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ం‌లో మస్క్‌ను ఏకంగా 133.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఫలితంగా అత్యధికమంది ఫాలోవర్లతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో స్థానానికి పడిపోయాడు. ఒబామాను ప్రస్తుతం 133 మిలియన్ల మంది ట్విట్టర్‌లో అనుసరిస్తున్నారు.

ట్విట్టర్‌లో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన రికార్డు 2020 నుంచి ఒబామా పేరుపైనే ఉంది. ఇప్పుడా రికార్డు మస్క్ సొంతమైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం గతేడాది అక్టోబరు 27న మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పుడు ఆయన ఫాలోవర్ల సంఖ్య 110 మిలియన్లుగా ఉంది. అంతలోనే ఆ సంఖ్య 133.1 మిలియన్లకు చేరుకోవడం గమనార్హం. అంటే సగటున రోజుకు లక్షమంది ఫాలోవర్లు వచ్చి చేరుతున్నారు. ట్విట్టర్ చెబుతున్న దాని ప్రకారం దాని నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 450 మిలియన్లు. అంటే వారిలో 30 శాతానికిపైగానే మస్క్‌ను ఫాలో అవుతున్నారన్నమాట.

  • Loading...

More Telugu News