Donald Trump: వచ్చే వారం అధికారుల ముందు లొంగిపోనున్న ట్రంప్..?

Donald trump likely to surrender before district attorney next week

  • వచ్చే వారం డిస్ట్రిక్ట్ అటార్నీ ముందు ట్రంప్  లొంగిపోతారన్న లాయర్
  • రంగంలోకి సీక్రెట్ సర్వీస్ అధికారులు
  • ట్రంప్ భద్రత, తరలింపు కోసం ఆయన లీగల్ టీంతో కలిసి ఏర్పాట్లు

హష్ మనీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం మన్ హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఎదుట సరెండర్ అయ్యే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది తాజాగా పేర్కొన్నారు. ఈ దిశగా ట్రంప్ న్యాయవాదుల బృందం అమెరికా పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో చర్చిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

స్టార్మీ డానియెల్స్ అనే పోర్న్ స్టార్‌తో సన్నిహితంగా ఉన్న ట్రంప్ ఆ విషయాన్ని ఆమె 2016 ఎన్నికల ముందు బహిరంగ పరచకుండా ఉండేందుకు తన లాయర్ ద్వారా కొంత డబ్బు (హష్ మనీ) ఆమెకు ఇప్పించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్నారు. డానియెల్స్‌కు ట్రంప్ ఈ డబ్బు ముట్ట చెప్పారంటూ న్యూయార్క్ కోర్టు జ్యూరీ తాజాగా ఆయనపై అధికారికంగా అభియోగాలు మోపింది. ఇక ఈ అభియోగాలపై కోర్టు విచారణ చేపట్టడానికి వీలుగా ఆయన డిస్ట్రిక్ట్ అటార్నీ ముందు వచ్చే వారం లొంగిపోనున్నారని సమాచారం. 
 
అమెరికా మాజీ అధ్యక్షుడైన ట్రంప్ ఎటువంటి సమస్యలు లేకుండా సరెండర్ అయ్యేందుకు వీలుగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు కూడా రంగంలోకి దిగారని తెలుస్తోంది. ట్రంప్ భద్రత, తరలింపునకు సంబంధించిన అంశాల్లో ఆయన లీగల్ టీంతో కలిసి సీక్రెట్ సర్వీసెస్ అధికారులు పనిచేస్తున్నారు. కాగా..తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. తాను నిరపరాధినని, రాజకీయంగా తనపై వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News