Raghu Rama Krishna Raju: జగన్ ప్రేరేపించడం వల్లే సత్యకుమార్ పై దాడి జరిగిందంటూ ప్రధానికి రఘురామ లేఖ

Raghu Rama Krishna Raju wrote PM Modi about attack on Sathya Kumar
  • అమరావతి ప్రాంతంలో బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి
  • ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన రఘురామ
  • దాడి విషయం తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ
  • సమగ్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి
ప్రధాని నరేంద్ర మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై అమరావతిలో దాడి జరిగిన విషయాన్ని రఘురామ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. జగన్ ప్రేరేపించడం వల్లే సత్యకుమార్ పై దాడి జరిగిందని తన లేఖలో పేర్కొన్నారు. దాడి విషయం తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని ప్రధానికి వివరించారు. ఈ దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. 

బీజేపీ నేత సత్యకుమార్ ఇవాళ అమరావతిలో రైతులకు మద్దతు పలికి వస్తుండగా, ఆయన కారును అడ్డుకున్న ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సత్యకుమార్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సత్యకుమార్ పై దాడి ఘటన పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
Raghu Rama Krishna Raju
PM Modi
Sathya Kumar
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News