Shivathmika: 'దొరసాని' తరువాత అసలు విషయం అర్థమైంది: శివాత్మిక

Shivathmika Interview
  • 'దొరసాని'తో పరిచయమైన శివాత్మిక
  • అప్పుడు కెరియర్ కలర్ఫుల్ గా కనిపించిందని వ్యాఖ్య   
  • ఆ తరువాత గ్యాప్ వచ్చిందని వెల్లడి 
  • ఇక్కడ నిలదొక్కుకోవడం ఈజీ కాదని అర్థమైందన్న శివాత్మిక 

జీవిత - రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శివాత్మిక, తనని తాను నిరూపించుకునే దిశగా ముందుకు వెళుతోంది. 'దొరసాని' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన శివాత్మిక, ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇటీవల వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో శివాత్మిక మాట్లాడుతూ .. 'రంగమార్తాండ'లో చేసే ఛాన్స్ రావడం నేను చేసుకున్న అదృష్టం. ఒక వైపున కృష్ణవంశీ గారు .. మరో వైపున సీనియర్ స్టార్స్ కావడంతో కొంత భయపడ్డాను. కానీ వాళ్లందరి సపోర్టుతో బాగా చేయగలిగాను. ఈ సినిమా చూసిన చాలామంది నన్ను గుర్తుపెట్టుకుని మెచ్చుకుంటూ ఉండటం విశేషం" అంటూ హర్షాన్ని వ్యక్తం చేసింది. 

'దొరసాని' సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నాను. ఈ సినిమా చేసిన తరువాత ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నాను. కానీ ఆ తరువాత గ్యాప్ రావడంతో, నేను అనుకున్నంత ఈజీ కాదు అనే విషయం అప్పుడు అర్థమైంది. ఇక్కడ మన పని మనం చేసుకుంటూ పోవడమే మన చేతుల్లో ఉందనే సంగతి స్పష్టమైంది" అంటూ చెప్పుకొచ్చింది. 

Shivathmika
Jeevitha
Rajasekhar
Tollywood

More Telugu News