Khaleel Ahmed: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఖలీల్ అహ్మద్.. అత్యంత వేగంగా 50 వికెట్లు!

Khaleel Ahmed becomes fastest Indian to reach 50 IPL wickets

  • స్టోయినిస్, పూరన్ వికెట్లను తీయడం ద్వారా ఘనత
  • అమిత్ మిశ్రా రికార్డు బద్దలుగొట్టిన ఖలీల్
  • 35వ మ్యాచ్‌లోనే ఘనత
  • ఓవరాల్‌గా రబడ పేరున రికార్డు

ఢిల్లీ కేపిటల్స్ సీమర్ ఖలీల్ అహ్మద్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ఇండియన్ క్రికెటర్‌గా తన పేరును రికార్డు పుస్తకాలకు ఎక్కించాడు. లక్నోలోని ఏకనా స్డేడియంలో గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ ఈ ఘనత సాధించాడు.

ఖలీల్ తన 35వ మ్యాచ్‌లోనే 50వ వికెట్ పడగొట్టాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అమిత్ మిశ్రా పేరున ఉంది. అమిత్ 37 మ్యాచుల్లో 50 వికెట్లు పడగొట్టగా, ఖలీల్ రెండు మ్యాచ్‌ల ముందే ఆ ఘనత అందుకున్నాడు. మార్కస్ స్టోయినిస్, నికోల్ పూరన్ వికెట్లను తీసుకోవడం ద్వారా ఖలీల్ ఈ ఘనత అందుకున్నాడు. ఇక, ఓవరాల్‌గా చూసుకుంటే దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ పేరున ఉంది. రబడ 27 మ్యాచుల్లోనే 50 వికెట్లు తీసుకున్నాడు.

ఖలీల్ అహ్మద్ 2016, 2017లో ఢిల్లీ జట్టులో ఉన్నప్పటికీ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ భారత్ తరపున 11 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. 2022-23 మధ్య దేశవాళీ క్రికెట్‌లో ఖలీల్ మూడు మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది అక్టోబరులో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

  • Loading...

More Telugu News