Sunil Gavaskar: స్టేడియంలో రష్మిక.. కామెంట్రీ బాక్స్ లో సునీల్ గవాస్కర్ స్టెప్పులు

Sunil Gavaskar Dances To Saami Saami As Rashmika Mandanna Performs At IPL 2023 Opening Ceremony
  • రెండు రోజుల కిందట అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్
  • వేడుకల్లో ప్రేక్షకులను అలరించిన అర్జిత్ సింగ్, తమన్నా, రష్మిక
  • పుష్పలోని ‘సామి’ పాటకు రష్మిక డ్యాన్స్.. కామెంట్రీ బాక్స్ లో గవాస్కర్ స్టెప్పులు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
రెండు రోజుల కిందట ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అట్టహాసంగా మొదలైంది. శుక్రవారం ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా భాటియా తమ డ్యాన్సులతో అలరించారు. తొలుత బాలీవుడ్ గాయకుడు, సంగీత దర్శకుడు అర్జిత్ సింగ్ తన పాటలతో నరేంద్ర మోదీ స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా, నేషనల్ క్రష్ రష్మిక.. డ్యాన్స్ చేశారు. 

రష్మిక.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’తో పాటు పుష్పలోని ‘సామి.. సామి’ పాటకు స్టెప్పులేశారు. తన ట్రేడ్ మార్క్ స్టెప్పులతో గ్రౌండ్ లో రష్మిక అలరిస్తుంటే.. స్టేడియంలో కామెంట్రీ బాక్సులో ఉన్న దిగ్గజ క్రికెటర్, ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ కూడా కాలు కదిపారు. రష్మిక డాన్స్ ను కంప్యూటర్ లో చూస్తూ.. ‘సామి.. సామి’ అని పాడుతూ డ్యాన్స్ చేశారు.

సన్నీ డాన్స్ చేస్తుండగా కామెంట్రీ బాక్స్ లోనే ఉన్న సైమన్ డౌల్, సంజయ్ మంజ్రేకర్ ఆయన్ను ఉత్సాహపరిచారు. ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టర్ నెరోలి మీడోస్.. ఐపీఎల్ లో కామెంటేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోను బన్నీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. 

సన్నీ తెలుగు పాటకు డాన్స్ చేయడం ఇదే కొత్త కాదు. ఇటీవల భారత్ - ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ సందర్భంగా.. ‘నాటు నాటు’కు గవాస్కర్ స్టెప్పులేశారు. నాటు నాటుకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత స్టార్ నెట్ వర్క్ తెలుగు కామెంటేటర్లు ఈ పాట గురించే చెప్పుకుంటుండగా అక్కడికి వచ్చిన సన్నీ.. ఎన్టీఆర్, చరణ్ ల ఐకానిక్ లెగ్ మూమెంట్ ను ట్రై చేశారు.
Sunil Gavaskar
Rashmika Mandanna
Saami Saami
IPL 2023

More Telugu News