brs: నిజమైన డిగ్రీ ఉన్నవారికి ఉద్యోగం లేదు.. డిగ్రీనే లేని వ్యక్తికేమో అత్యున్నత ఉద్యోగం: ఎమ్మెల్సీ కవిత

people with real degrees get no job and a person with no degree has the top job tweets MLC Kavitha
  • దేశంలో నిరుద్యోగం రేటు 7.8 శాతంగా   ఉందన్న బీఆర్ఎస్ నేత
  • ఇది మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుందని ఆవేదన
  • యువతను పట్టించుకోవడం లేదంటూ ప్రధాని మోదీపై పరోక్ష విమర్శ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పరోక్షంగా విమర్శలు చేశారు. మోసపూరిత హామీలతో యువతను కూడా దగా చేశారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందంటూ ట్వీట్ చేశారు.

‘ దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉంది. ఇది మూడు నెలల గరిష్ఠ స్థాయి. కానీ దీన్ని పట్టించుకుంటున్నారా? యువత శక్తి, సామర్థ్యాలను ఉపయోగించుకునే కృషి చేస్తున్నారా? నేడు భారతదేశంలో ఉన్న వాస్తవం ఏంటంటే.. నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు.. కానీ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం దక్కింది’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.
brs
mlc kavitha
Narendra Modi
tweet

More Telugu News