Balineni Srinivasa Reddy: మేం తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్న తప్ప ఎవరూ మిగలరు: బాలినేని

Balineni counters Chandrababu comments
  • వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న చంద్రబాబు
  • మరి ఇద్దరినే ఎందుకు కొన్నారన్న బాలినేని
  • జగన్ నాయకత్వంలో ప్రతి ఎమ్మెల్యే సంతోషంగా ఉన్నాడని వెల్లడి
వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. 40 మంది మా ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటే ఇద్దరినే ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. తాము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్న తప్ప ఎవరూ మిగలరని బాలినేని వ్యాఖ్యానించారు. టీడీపీలో ఆ ఇద్దరూ తప్ప మిగతా వాళ్లంతా తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

సీఎం జగన్ నాయకత్వంలో ప్రతి వైసీపీ ఎమ్మెల్యే సంతోషం ఉన్నారని వెల్లడించారు. ఇక, ముందస్తు ఎన్నికలు, క్యాబినెట్ విస్తరణ అంటూ జరుగుతున్న ప్రచారాలు మీడియా హైప్ తప్ప, అందులో వాస్తవం లేదని బాలినేని స్పష్టం చేశారు.
Balineni Srinivasa Reddy
Chandrababu
YSRCP
TDP

More Telugu News