Nayanthara: తమ పిల్లల పూర్తి పేర్లు చెప్పిన నయనతార

Nayanthara And Husband Vignesh Shivan Reveals Full Names Of Their Twin Boys
  • గతేడాది అక్టోబర్ లో కవలలకు జన్మనిచ్చిన నయనతార, విఘ్నేష్ శివన్
  • చిన్నారుల పూర్తి పేర్లను వెల్లడించని స్టార్ కపుల్
  • తాజాగా ఓ ఈవెంట్ లో బయటపెట్టిన నయన్
  • ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్లడించిన విఘ్నేష్
లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. గతేడాది అక్టోబర్ లో సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు. ఇప్పటివరకు పిల్లల ముఖాలను బయటికి చూపెట్టలేదు. కనీసం చిన్నారుల పూర్తి పేర్లను వెల్లడించలేదు. తమ పిల్లల పేర్లు ఉయిర్, ఉలగం అని మాత్రమే విఘ్నేష్ చెప్పారు. పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారు కానీ.. ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో నయనతార తమ పిల్లల పూర్తి పేర్లను వెల్లడించారు. ఒక కొడుకు పేరు ‘ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్’ అని, రెండో కొడుకు పేరు ‘ఉలగ్ ధైవాగ్ ఎన్ శివన్’ అని తెలిపారు. ఇటీవల నయనతార ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడ ఆమెను పిల్లల పూర్తి పేర్లను చెప్పమని అడగడంతో బయటపెట్టారు. విఘ్నేష్ శివన్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి పిల్లల పేర్లను వెల్లడించారు.

గతేడాది జూన్ 9న డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి దగ్గరి బంధువులను, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో సూర్య, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు.

అయితే పెళ్లయిన నాలుగు నెలలకే.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. వారి కాళ్లను ముద్దాడుతున్నట్టుగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పుడే వారి పేర్లను ఉయిర్, ఉలగం అంటూ విఘ్నేష్ తెలియజేశారు.

ఇక పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై నయనతార ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘జవాన్’లో షారుఖ్ ఖాన్ తో నటిస్తున్నారు. ఇది జూన్ 2న థియేటర్లలో విడుదల కానుంది.
Nayanthara
Vignesh Shivan
Names Of Twin Boys

More Telugu News