CSK: టాస్ గెలిచిన సూపర్ జెయింట్స్... గెలుపు కోసం కసిగా సీఎస్కే

CSK strives for victory as SLG won the toss
  • ఐపీఎల్ లో నేడు సీఎస్కే వర్సెస్ సూపర్ జెయింట్స్
  • సొంతగడ్డపై ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టు
ఐపీఎల్-16లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఓటమిపాలైన సీఎస్కే జట్టు సొంత గడ్డపై జరుగుతున్న నేటి మ్యాచ్ లో గెలిచి తీరాలని కృతనిశ్చయంతో ఉంది. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ తప్ప ఆశించిన స్థాయిలో రాణించిన వాళ్లే లేరు. ఈసారి బ్యాటింగ్ వైఫల్యాలకు చోటివ్వరాదని ధోనీ అండ్ కో భావిస్తోంది. గత మ్యాచ్ ఆడిన జట్టే ఈసారి కూడా బరిలో దిగనుంది. 

మరోవైపు, ఇప్పటికే తానాడిన తొలి మ్యాచ్ లో నెగ్గిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చెన్నైపైనా అదే ఒరవడి కొనసాగించాలని భావిస్తోంది. దాంతో ఇవాళ్టి మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి.
CSK
LSG
Toss
Hyderabad

More Telugu News