Hyderabad: కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య.. హైదరాబాద్ లో దారుణం

Student Dies By Suicide After Jumping Off Hostel Building in Hayathnagar
  • హాస్టల్ లో ఉంటూ నీట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని
  • సోమవారం రాత్రి నాలుగో అంతస్థు నుంచి దూకిన యువతి
  • ఆసుపత్రికి తరలించేలోపే ఆగిన ఊపిరి.. విచారణ చేపట్టిన పోలీసులు
హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. కాలేజీ బిల్డింగ్ లోని నాలుగో అంతస్తు నుంచి దూకడంతో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణం పోయిందని పోలీసులు తెలిపారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ఉన్న ఎక్సెల్ కాలేజీలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. విద్య ప్రియాంక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన విద్య ప్రియాంక నీట్ కోచింగ్ కోసం ఎక్సెల్ కాలేజీలో చేరింది.

హాస్టల్ లో ఉంటూ క్లాసులకు హాజరయింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. విద్య ప్రియాంకను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే విద్య ప్రియాంక చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కాగా, విద్య ప్రియాంకకు తమ కాలేజీకి ఎలాంటి సంబంధంలేదని ఎక్సెల్ కాలేజీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. చౌటుప్పల్ సమీపంలో ఉన్న దావో మెడికల్ అకాడెమీలో విద్య ప్రియాంక కోచింగ్ తీసుకుంటోందని, తాము కేవలం ఆకామిడేషన్ ఇచ్చినట్లు పేర్కొంది. మరో ఐదుగురు విద్యార్థులు కూడా ఇక్కడ ఇలాగే ఉంటున్నట్లు ఎక్సెల్ కాలేజీ యాజమాన్యం వివరణ ఇచ్చింది.
Hyderabad
student suicide
neet coaching
jumped from building

More Telugu News