Somu Veerraju: పవన్ కల్యాణ్ తో కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాడతాం: సోము వీర్రాజు

Will fight against YSRCP with Pawan Kalyan says Somu Veerraju
  • బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ఉన్నాయన్న వీర్రాజు
  • తమ పార్టీ పెద్దలను ఢిల్లీలో పవన్ కలిశారని వెల్లడి 
  • సత్యకుమార్ పై వైసీపీ నేతలు దాడి చేయడంపై తమ పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందని వ్యాఖ్య
ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ఉన్నాయని... వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసే పని చేస్తాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఢిల్లీలో తమ పార్టీ పెద్దలను పవన్ కలిసి మాట్లాడారంటే రెండు పార్టీల మధ్య ఎంత బలమైన బంధం ఉందో అర్థమవుతుందని చెప్పారు. పవన్ కల్యాణ్ తో కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతామని అన్నారు. 

రాజకీయ అవసరాల కోసం అనేక పార్టీల నేతలను కలుస్తుంటామని... రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చంద్రబాబును కలిశామని, అంతమాత్రాన టీడీపీతో పొత్తు ఉందని కాదని వీర్రాజు చెప్పారు. తమ పార్టీ నేత సత్యకుమార్ పై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని అందరూ చూశారని, ఈ విషయంపై తమ పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ గా ఉందని అన్నారు.

Somu Veerraju
BJP
Pawan Kalyan
YSRCP

More Telugu News