AB de Villiers: ఐపీఎల్ 2023 కప్పు కొట్టేదెవరో చెప్పిన డీ విలియర్స్ 

Though I Want RCB To Win AB de Villiers Predicts Another Team To Win IPL 2023
  • ఈ ఏడాదీ గుజరాత్ టైటాన్స్ దే తుది విజయమన్న డీ విలియర్స్
  • గతంలో తాను చెప్పిన దానికే కట్టుబడి ఉంటానని ప్రకటన
  • మంచి సమతూకంతో కూడిన గొప్ప జట్టుగా అభివర్ణన 
ఐపీఎల్ 2023 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ లోనూ గుజరాత్ టైటాన్స్ జట్టు బలంగా కనిపిస్తోంది. గతేడాదే కొత్తగా అవతరించిన గుజరాత్ టైటాన్స్.. తొలి ఏడాదే కప్పును ఎగరేసుకుపోయింది. ఈ ఏడాది కప్పు ఎవరి వశం అవుతుందనే దానిపై అభిమానుల్లో భిన్న అంచనాలు నెలకొన్నాయి. తాము నచ్చే జట్టు విజేతగా నిలవాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. కానీ, ఓ సగటు అభిమాని కంటే, ఒక క్రికెటర్ విజేతను కచ్చితంగా అంచనా వేయగలడు. ఆర్సీబీ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డీ విలియర్స్ ఇదే విషయమై తన అంచనాలను ఓ టీవీ చానల్ తో పంచుకున్నాడు.

‘‘చాలా కాలం క్రితం ఐపీఎల్ వేలం సమయంలోనే గుజరాత్ జట్టు విజేతగా నిలుస్తుందని చెప్పా. ఆర్సీబీ గెలవాలని నాకు ఉన్నప్పటికీ, గతంలో చెప్పిన దానికే నేను కట్టుబడి ఉంటా. ఆ జట్టు (గుజరాత్) గొప్పది. ఎంతో సమతూకంతో ఉంది. వారి దగ్గర కావాల్సినన్ని సామర్థ్యాలు ఉన్నాయి’’ అని డీ విలియర్స్ అన్నాడు. విరాట్ కోహ్లీలో పెద్ద మార్పు తానేమీ చూడడం లేదంటూ, అతడి టెక్నిక్ ఇప్పటికీ బలంగా ఉందన్నాడు.
AB de Villiers
IPL 2023
champion
prediction
gujarat titans

More Telugu News