AP 40G: ఏపీలో ప్రభుత్వ వాహనాలకు ఇకపై కొత్త నెంబరు సిరీస్

New number series for govt vehicles in AP

  • ఏపీలో ప్రభుత్వ వాహనాలకు AP 40G సిరీస్
  • ఎంవీఐ చట్ట సవరణకు నోటిఫికేషన్
  • సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే తెలపాలన్న రవాణా శాఖ

ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరింది. ఈ చట్ట సవరణ అనుసరించి ప్రభుత్వ వాహనాలకు AP 40G అనే సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ప్రత్యేక సిరీస్ ను కేటాయిస్తారు. 2018 నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాలకు కలిపి AP 39 సిరీస్ లో నెంబర్లు కేటాయిస్తోంది. ఇక మీద నూతన రిజిస్ట్రేషన్ సిరీస్ తీసుకురావడంతో ప్రైవేటు వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకు తేడా స్పష్టంగా తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News